Vividha: ఈ వారం వివిధ కార్యక్రమాలు 12 01 2026
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:33 AM
అలిశెట్టి జయంతి సభ, అలిశెట్టి పురస్కార ప్రదానం, పాలమూరు సాహితి అవార్డు, పీచర సునీతారావు పురస్కారాలకు ఆహ్వానం, పైనేని మునెమ్మ పురస్కారాలు...
అలిశెట్టి జయంతి సభ
అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా జనవరి 12 ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ అలిశెట్టి ప్రభాకర్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నది. ముఖ్య అతిథి జూపల్లి కృష్ణారావు, అధ్యక్షత బాలాచారి, అతిథులు– కోదండరాం, జయధీర్ తిరుమలరావు, పాశం యాదగిరి, నరసింహారెడ్డి. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యంపై నాళేశ్వరం శంకరం, బద్రీ నర్సన్ ప్రసంగిస్తారు. అనంతరం యువకవుల కవి సమ్మేళనం
తెలంగాణ సాహిత్య అకాడమీ
అలిశెట్టి పురస్కార ప్రదానం
తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్యర్యంలో అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాదికి చెమన్ ఎంపికయ్యారు. జనవరి 12న కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో సివీ కుమార్ అధ్యక్షతన పురస్కార ప్రదాన సభ జరుగనుంది. దేవులపల్లి అమర్, నలిమెల భాస్కర్, నారదాసు లక్ష్మణరావు, కొండి మల్లారెడ్డి, బూర్ల వేంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం తదితరులు హాజరవుతారు.
దామరకుంట శంకరయ్య
పాలమూరు సాహితి అవార్డు
పాలమూరు సాహితీ అవార్డుకు 2025లో ముద్రితమైన వచన కవితా సంపుటాలు మూడేసి ప్రతులను జనవరి 31 లోపు పంపాలి. ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/– నగదు బహుమతితో పాటు జ్ఞాపికను ఇస్తారు. చిరునామా: భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం. 8–5–38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, ఫోన్– 9032844017.
భీంపల్లి శ్రీకాంత్
పీచర సునీతారావు పురస్కారాలకు ఆహ్వానం
పీచర సునీతారావు స్మారక పురస్కారాలకు కవిత్వం, కథలు, విమర్శ ప్రక్రియల్లో సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మార్చ్ 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు వెలువడిన సంపుటాలు మూడు కాపీలను ఫిబ్రవరి 25 లోపు పంపాలి. ఎన్నికైన ప్రతి సంపుటానికి మే 10న రవీంద్రభారతి, హైదరాబాద్‌లో రూ.15వేల నగదు తోపాటు, సత్కారం ఉంటుంది. చిరునామా: పీచర సునీతా రావు ఫౌండేషన్, కేర్ ఆఫ్: విజయేందర్ రావు, ప్లాట్.నం 505, బ్లాక్ డి, భీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్స్, సుచిత్ర సర్కిల్ వద్ద, జీడిమెట్ల, హైదరాబాద్–67. ఫోన్: 9866043441.
కాంచనపల్లి గోవర్ధన్ రాజు
పైనేని మునెమ్మ పురస్కారాలు
తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, పైనేని మునెమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పైనేని మునెమ్మ స్మారక పురస్కారాన్ని నారంశెట్టి ఉమామహేశ్వర రావుకు, పైనేని చిన్న బుచ్చినాయుడు స్మారక పురస్కారాన్ని జూటూరు తులసీదాస్, బసయ్య స్మారక పురస్కారాన్ని మౌని స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం జనవరి 25వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి, శాసనమండలి విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జివి పూర్ణచంద్, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి పలమనేరు బాలాజీ తదితరులు హాజరవుతారు.
పి. తులసినాథం నాయుడు
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?