Share News

The Soul of the Village: పల్లె మనసు

ABN , Publish Date - Jan 15 , 2026 | 01:13 AM

పల్లెకు ప్రాణం లేచొచ్చింది వెయ్యి చందమామల వెన్నెల అమృతంలా కురిసినట్టు తన్మయంతో..

The Soul of the Village: పల్లె మనసు

పల్లెకు ప్రాణం లేచొచ్చింది

వెయ్యి చందమామల వెన్నెల

అమృతంలా కురిసినట్టు

తన్మయంతో తడిసిపోయింది

తల్లి బిడ్డను అక్కున చేర్చుకుని

ముద్దాడినట్టు మురిసిపోయింది

బతుకు జట్కా కోసం

పట్నం బాట పట్టిన పిల్లలు

పండగ పూట ఊర్లో అడుగిడేసరికి

పల్లె ఆనందం ఉప్పొంగి

పచ్చ కోక కట్టిన పడతిలా

పైరుతో తలూపుతూ

బిడ్డలకు స్వాగతం పలికింది

పాపం పల్లె అమాయకమైనది

మూన్నాళ్ళ ముచ్చటే అయినా

దానికి అది అలవాటే

మళ్లొచ్చే పండగ కోసం

కళ్ళలో వత్తులు వేసుకుని

అమ్మలా వేచి ఉండటం!

– న్యాలకంటి నారాయణ

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 01:13 AM