విరామం
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:29 AM
ఇల్లూ పిల్లలు ఆకలి జడివానకు అల్లాడిపోతున్నరు పని గోవర్ధనగిరి ఎత్తలేకపోతున్నా కోదండము...
ఇల్లూ పిల్లలు
ఆకలి జడివానకు అల్లాడిపోతున్నరు
పని గోవర్ధనగిరి ఎత్తలేకపోతున్నా
కోదండము పట్టలేకపోతున్నా
బంగారు జింకను వేటాడలేకపోతున్నా
ఈ ఆర్మోనియం మెట్లపై
ఇల్లు ఇల్లంతా సంతోషించే
ఆనందగీతాలకు స్వరాలు కూర్చలేకపోతున్నా
విల్లు ముట్టలేను
విద్య నేర్పిన గురువెవ్వడో
బొటనవేలు కోసుకుపోయినట్టు
పెద్దనేలుకు గాయమయ్యింది
శిశిర వసంతాల నడుమ
మనసు కలవరపడుతున్నది
నా నేత జనులకు
కాలు నొచ్చినా చెయ్యి నొచ్చినా
మగ్గం కుంటి గుర్రమే
నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం రాదు
నలభై గుండ్లు అప్పు తెచ్చుకోవడమే
జీతమిచ్చే వాడుంటే బాగుండు
డుమ్మా కొట్టినా
సగం కూలీ దక్కేది
కడుపు కాలే కాలం మీదికి
దండెత్తిపోవాలనే ఉన్నది
వేసవి సెలవులు వచ్చినట్టు
కరువులో అధిక మాసం అన్నట్టు
నూరులో నూటా ఒక్కటి
యుద్ధం వాయిదా పడ్డది
గజ్జెల రామకృష్ణ
89774 12795
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..
ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్.