Share News

ఎప్పుడో

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:38 AM

అద్దంలో పక్షి గాఢనిద్రలో రుకుపోయేవరకూ గాయంలా జీవితం తెలియకుండానే ఉంది దారి కనిపించని చీకటిలో వెలుగెప్పుడొస్తుందో...

ఎప్పుడో

అద్దంలో పక్షి

గాఢనిద్రలో కూరుకుపోయేవరకూ

గాయంలా జీవితం

తెలియకుండానే ఉంది

దారి కనిపించని చీకటిలో

వెలుగెప్పుడొస్తుందో

-2-

నన్నే కాదు

నా శరీరం నీడల్ని సైతం

ఈ భూమిమీద నడిపించిన వెలుగు

నన్ను చూసిన మొదటి వేకువ

నన్ను మడతపెట్టే చివరి రాత్రి

నాకు నీడనిచ్చిన చెట్లు

నా ఆకాశం మీద ఎగిరే పక్షులు

నన్ను గుర్తుంచుకున్నా లేకపోయినా

నన్ను తట్టిలేపే

నా పదాలకు

ఆ శ్రమ తప్పినపుడు

నేను లేని క్షణాల్ని

సమయం తప్పకుండా గమనిస్తుంది

ఏదో ఒక రోజు

నా నిశ్శబ్దాన్ని

ఎవరో ఒకరు

తప్పకుండా అనువాదం చేస్తారు

ముకుంద రామారావు

99083 47273

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 05:38 AM