Share News

దృష్టికోణం

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:07 AM

రాలి పడిన నిద్రలేని రాత్రి ఏ ఒక్కటీ వృథా కాదు మొలకెత్తిన అనుభవంగానో మొగ్గ తొడిగిన...

దృష్టికోణం

రాలి పడిన నిద్రలేని రాత్రి

ఏ ఒక్కటీ వృథా కాదు

మొలకెత్తిన అనుభవంగానో

మొగ్గ తొడిగిన జీవితంగానో

ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర

నవ్వుతూ మనవైపే నిలబడుతుంది

ఆకాశం నుంచి దొర్లిపడిన

వాన చినుకు నేల చేరాక

నిరుపయోగం అనుకోవడానికి

ఎంత మాత్రం వీలు లేదు

మట్టి రేణువు మనసును తడిచేస్తుంది

పువ్వు పెదాలపై నవ్వును పూయిస్తుంది

మొక్క ముఖం మీద

ఒక మెరుపు మెరుపిస్తుంది

వీగిపోయిన ఏ ప్రయత్నమూ

ఓటమి కానే కాదు

గెలుపు పంట కోసం విత్తిన

మొట్టమొదటి గింజే కదా అది

ఇక్కడి నుంచి జారిపోయిందీ అంటే

చల్లగాలి ఇంకెక్కడో వేడి సెగల్ని

ఓదారుస్తుందనేగా!

దృష్టి కోణమే దృశ్యం!

మనసు నమ్మిందే సత్యం!

మస్తిష్కం మహామాయది

ఎంత పనైనా చేస్తుంది!

బంగార్రాజు కంఠ

85003 50464

ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Feb 16 , 2026 | 04:07 AM