బువ్వలాట
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:05 AM
భూమీ ఆకాశమూ నలుదిక్కులూ ఆరుగురు పిల్లలు ఆటకి కూర్చుంటారు..
భూమీ ఆకాశమూ
నలుదిక్కులూ
ఆరుగురు పిల్లలు
ఆటకి కూర్చుంటారు
లక్కపిడతలు వేసుకుని
రెండు పక్షాలుగా
చంద్రుడ్ని పదిహేను ముక్కలు చేసి
చీకటికి తినిపిస్తారు
ఒక పక్షం
చీకటిని పదిహేను పళ్లాల్లో సర్ది
చంద్రుడికి తినిపిస్తారు
మరొక పక్షం
చంద్రుడెక్కడికీ పోడు
చీకటెక్కడికీ పోదు
పిల్లల సంతోషం కోసం
దోబూచులాటలాడతారు
ఉత్తుత్తి వంటల వడ్డింపుల
బువ్వలాట అది
ఏ రెండూ ఒకలా ఉండని
విభిన్న రాత్రుల తాయిలాలు
మనకి
వెంకటేష్ పైడికొండల
81215 33112
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్