ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 03 2026
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:06 AM
‘పొలం గట్ల వెంట’ కవితా సంపుటి, కవితా సంపుటాలకు ఆహ్వానం, అరసం కథ, కవితల పోటీ, కథా సంపుటాలకు ఆహ్వానం, శాంతా–వసంతా ట్రస్ట్ పురస్కారాలు...
‘పొలం గట్ల వెంట’ కవితా సంపుటి
బండ్ల మాధవరావు కవితా సంపుటి ‘పొలం గట్ల వెంట’ ఆవిష్కరణ సభ మార్చి 10 ఉ.10గంటలకు హిందీ భవన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నంలో జరుగుతుంది. ఆవిష్కర్త వి.వి. రమణమూర్తి; గౌరవ అతిథులు మీగడ రామలింగస్వామి, జర్రా అప్పారావు, వెలమల సిమ్మన్న, గొట్టుముక్కల మురళి ప్రసాద్; అధ్యక్షులు నల్లా సత్యనారాయణ.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
కవితా సంపుటాలకు ఆహ్వానం
పల్లా నరసింహులు స్మరణలో ఏర్పాటు చేసిన ‘పల్లా జాతీయ కవితా పురస్కారం’ కోసం కవులు 2024 నుంచి ఇప్పటివరకు ప్రచురితమైన కవితా సంపుటాలను పంపాలి. ఉత్తమ కవితా సంపుటికి రూ.7500 నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో సత్కారం ఉంటుంది. కవితా సంపుటాలు 3 కాపీలను మార్చి 15 లోపు చిరునామా: పల్లా కృష్ణ, ప్రిన్సిపల్, సిఎస్‌ఎస్‌ఆర్ & ఎస్‌ఆర్‌ఆర్‌ఎమ్ డిగ్రీ, పీజీ కాలేజ్, 13–522, రెడ్డి కాలనీ, కమలాపురం–516 289, వైఎస్‌ఆర్ కడప జిల్లా, ఫోన్: 99851 93868కు పంపాలి.
యువ సాహితి
అరసం కథ, కవితల పోటీ
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరగనున్న సదర్భంగా నిర్వహిస్తున్న పోటీకి కథలు ఎ4 సైజు షీటుపై 16 పాయింట్ సైజులో ఒక వైపే 5 పేజీలకూ, కవితలు రెండు పేజీలకూ మించకుండా డిటిపి చేసి ఏప్రిల్ 13 లోపు పంపాలి. మొదటి, రెండవ, మూడవ బహుమతి కథలకు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు; కవితలకు రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి ఇస్తారు. చిరునామా: వల్లూరు శివప్రసాద్, 401, శ్రావణి రెసిడెన్సీ, 6/3, ఎస్.వి.ఎన్. కాలనీ, గుంటూరు–522006, ఫోన్: 92915 30714కు పంపాలి.
వల్లూరు శివప్రసాద్
కథా సంపుటాలకు ఆహ్వానం
జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ ఆధ్వర్యంలో రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి కథల సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. ఈ పురస్కారం కింద ప్రశంసా పత్రం, శాలువాతో పాటు రూ.10,116/– నగదు బహుమతి ఇస్తాము. జనవరి 2023 – డిసెంబరు 31, 2025 మధ్య ప్రచురితమైన సంపుటాలు నాలుగు ప్రతులను మార్చి 20 లోపు చిరునామా: గాజుల రవీందర్, ఇం.నం:8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నం.12, భగత్ నగర్, కరీంనగర్–505001, ఫోన్: 98482 55525కు పంపాలి.
గాజుల రవీందర్
శాంతా–వసంతా ట్రస్ట్ పురస్కారాలు
పద్మభూషణ్ డా.వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘శాంతా–వసంతా ట్రస్ట్’ సాహిత్య సంగీత రంగాల్లోని వారికి ఇచ్చే పురస్కారాలను కోడూరు ప్రభాకరరెడ్డి, అల్లంరాజు వెంకటరావు (సుధామ), డి.వి. మోహనకృష్ణ స్వీకరిస్తారు. మార్చి 15 ఉ.10గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట, హైదరాబాద్‌లో ఒక్కోక్కరికి రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు, శాలువా, జ్ఞాపి క, ప్రశంసాపత్రంతో సత్కారం ఉంటుంది.
శాంతా–వసంతా ట్రస్ట్
ఇవి కూడా చదవండి..
ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ