ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 02 2026
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:03 AM
తెలుగు లిటరరీ కాంగ్రెస్, ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల, నందిని సిధారెడ్డి సాహిత్యంపై సదస్సు, మలిశెట్టి సీతారాం పురస్కారం, మనకు మరెన్నో చారిత్రక నవలలు ఉన్నాయి...
తెలుగు లిటరరీ కాంగ్రెస్
రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రూమ్ నెంబర్ 133, ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. యువరచయితల సాహిత్య సృజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు పాల్గొంటారు. కవితా పఠనం, గాన/ కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ కాంగ్రెస్‌కు డైరక్టర్ చింతకింది కాశీం, కన్వీనర్ సాగి కమలాకర శర్మ.
చింతకింది కాశీం
ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల
‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మొదటి సమావేశం ఫిబ్రవరి 11 ఉదయం డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, ఎచ్చెర్ల జర్నలిజం శాఖ తరగతిగదిలో జరుగుతుంది. ‘కళింగ సాహిత్యం–దశ దిశ’ అంశంపై అట్టాడ అప్పలనాయుడు విద్యార్థులతో మాట్లాడుతారు. సభలో జి. లీలావరప్రసాద్, కె. ఉదయ్ కిరణ్ పాల్గొంటారు.
బాలసుధాకర్
నందిని సిధారెడ్డి సాహిత్యంపై సదస్సు
‘నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన’ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, ఘట్కేసర్‌లో ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరుగుతుంది. పి. స్నేహలత అధ్యక్షత వహించే సదస్సులో వి. బాలకిష్టారెడ్డి, మాడభూషి సంపత్ కుమార్, కాశీం, సాగి కమలాకరశర్మ, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలాచారి తదితరులు పాల్గొంటారు.
శ్రీభాష్యం అనురాధ
మలిశెట్టి సీతారాం పురస్కారం
మలిశెట్టి సీతారాం పురస్కారాల ప్రదానం ఫిబ్రవరి 14 ఉ.10 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. మలిశెట్టి జీవన సాఫల్య పురస్కారాన్ని వి. రాజారామమోహనరావు, వార్షిక సాహిత్య పురస్కారాన్ని శ్రీఊహ స్వీకరిస్తారు. కథలపోటీలో తొలి మూడు బహుమతులకు వి.శాంతి ప్రబోధ ‘న్యూరో చిప్డ్ మనిషి’, కిరణ్ ‘నీది నీది కాదు’, పొత్తూరి సీతారామరాజు ‘ధన్వంతరి’ కథలు ఎంపికయ్యాయి. వీటితోపాటు ప్రోత్సాహక బహుమతులకు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలను కలిపి ప్రచురించిన సంకలనం ‘కథా ప్రపంచం 2025’ ఆవిష్కరణ జరుగుతుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు వాడ్రేవు చినవీరభద్రుడు, విహారి, శరత్ చంద్ర తదితరులు. వివరాలకు: 99850 13234.
మలిశెట్టి శ్యామ్ ప్రసాద్
మనకు మరెన్నో చారిత్రక నవలలు ఉన్నాయి
‘ఏది ఉత్తమ చారిత్రక నవల’ పేరుతో జనవరి 26న ‘వివిధ’లో ప్రసాద్ సూరి రాసిన వ్యాసంలో గతంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ వచ్చిన చారిత్రక నవలలు, రచయితల గురించి కొంత సమాచారం ఇచ్చారు. అలాగే, సమకాలీన రచయితలైన బండి నారాయణస్వామి రాసిన రెండు నవలలు, కరణం బాలసుబ్రమణ్యం పిళ్ళై రాసిన నవల, సాయి పాపినేని ‘ఆంధ్ర పథం’ ఉదహరించారు. ఇవేగాక మహీధర కొన్ని నవలలు, సాధు సుబ్రమణ్య శర్మ ‘బంకోలా’, ఛాయరాజ్ ‘కారువాకి’, చంద్రలత ‘నీలంపురాశి’, మధురాంతకం నరేంద్ర ‘మనోధర్మపరాగం’, పి. మోహన్ ‘రాజా రవివర్మ’, సడ్లపల్లి చిదంబరరెడ్డి ‘లేపాక్షి’, దీర్ఘాసి విజయభాస్కర్ ‘వీర కళింగం’, నాగభూషణ్ ‘డిసెంబ్రిష్ట్ ఖైదీ’, అల్లం రాజయ్య ‘సైరన్’, ప్రాణరావు ‘మాదన్న’ పుస్తకాలను కూడా ఉదహరించివుంటే బాగుండేది. ఇవేగాక మన దృష్టికి రాని మరికొన్ని చారిత్రక నవలలు తెలుగులో వచ్చి ఉండవచ్చు. ‘‘తెలుగులో చరిత్ర ఆధారంగా వస్తున్న రచనలు చాల తక్కువ. దాదాపు లేవనే చెప్పాలి’’ అని ప్రసాద్ సూరి చేసిన తీర్మానం సరికాదు.
కొత్తపల్లి రవిబాబు
94901 96890
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News