కల్లుగీత కార్మికులపై వివక్ష!
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:03 AM
తెలంగాణలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఐదు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. తరతరాల నుంచి వృత్తి చేసుకుంటూ ప్రభుత్వాలకు వీరు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లించారు. ప్రాణాలు కోల్పోతామని..
తెలంగాణలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఐదు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. తరతరాల నుంచి వృత్తి చేసుకుంటూ ప్రభుత్వాలకు వీరు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లించారు. ప్రాణాలు కోల్పోతామని తెలిసీ బ్రతుకుతెరువు కోసం కల్లుగీత వృత్తిలో కొనసాగుతున్నారు. వీరి అభివృద్ధికి, సంక్షేమాలకు ప్రభుత్వాల దగ్గర ప్రత్యేక ప్రణాళిక లేదు. గత బడ్జెట్‌లో రూ.5000 కోట్లు అడిగితే, కేటాయించింది 70 కోట్లు మాత్రమే. వీటిలో రూ.17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మిగతావి ఈ మార్చి ఆఖరుకి ఖర్చు చేయకపోతే నిరుపయోగమవుతాయి.
గత రెండు సంవత్సరాలో 850 మంది చెట్టు మీద నుంచి పడి ప్రమాదానికి గురయ్యారు. వీరిలో 140 మంది చనిపోయారు. ఇంత ప్రాణ నష్టం ఏ వృత్తిలోనూ లేదు. 170 మంది శాశ్వత వికలాంగులయ్యారు. వీరికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. 2024 జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఈ రోజే మంత్రులకు చెప్పి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. 20 నెలలు అవుతున్నా అతీగతీ లేదు. ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను 10 లక్షలకు, పెన్షన్ 4 వేలకు పెంచుతామన్నారు కానీ అమలు చేయలేదు. పెన్షన్లకు కొత్తగా దరఖాస్తులే స్వీకరించడం లేదు. ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం, 2,20,000 మంది సభ్యత్వం కలిగిన గీత కార్మికుల్లో 20వేల మందికి మాత్రమే ఇచ్చారు. ట్యాంక్ బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని భూమి పూజ చేశారు, ఆరు నెలలు దాటినా పనులు సాగడం లేదు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామన్నారు, అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. రాబోయే బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5000 కోట్లు కేటాయించాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం నిరాహారదీక్ష చేయనున్నది.
యం.వి. రమణ, అధ్యక్షులు,
కల్లుగీత కార్మిక సంఘం
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News