నామినేటెడ్ ఎమ్మెల్సీల్లో సాహితీవేత్తకు స్థానమివ్వాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:43 AM
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తెలంగాణ శాసనమండలికి ఆరుగురు సభ్యుల్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సేవ తదితర రంగాల్లో నిష్ణాతులను ఆయన...
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తెలంగాణ శాసనమండలికి ఆరుగురు సభ్యుల్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సేవ తదితర రంగాల్లో నిష్ణాతులను ఆయన ఈ పదవులకు నామినేట్ చేస్తారు. ఈ ఆరుగురిలో నవంబర్ 14వ తేదీతో ముగ్గురు సభ్యులు బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్నలు పదవీ విరమణ చేయనున్నారు.
గుర్రం జాషువా, వానమామలై వరదాచార్యులు లాంటి దిగ్దంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలికి ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. సి.నారాయణరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో గోరటి వెంకన్న సాహితీ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆయన పదవి ముగియనుండడంతో ఆ ఖాళీ స్థానాన్ని మరో తెలంగాణ సాహితీవేత్తతో మాత్రమే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి మనవి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ సాహిత్య అకాడెమీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. అదే సమయంలో మొన్న ముఖ్యమంత్రి ఎల్‌నినో ప్రభావం గురించి మాట్లాడుతూ కవులు, గాయకులు, రచయితలు ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరిండు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గోరటి వెంకన్న పదవీ విరమణతో ఖాళీ అయ్యే స్థానాన్ని ఆంధ్రా వలసవాదాన్ని వ్యతిరేకించే మరో సాహితీవేత్తతో భర్తీ చేయాలని కవులు, కళాకారులు, రచయితలు, బుద్ధిజీవులుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నామినేట్ చేసే అభ్యర్థుల్లో ఉద్యమ నేపథ్యం ఉన్న సాహితీవేత్తకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజ్ఞప్తి చేస్తున్నాం.
పసునూరి రవీందర్, సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, ప్రసేన్, నాళేశ్వరం శంకరం, సిద్ధార్థ, స్కైబాబ, ఉదారి నారాయణ, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, వెల్దండి శ్రీధర్, కటుకోజ్వల రమేశ్, కూకట్ల తిరుపతి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, మెర్సీ మార్గరెట్, గాదె వెంకటేశ్, ఆర్ రత్నాకర్ రెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, అఫ్సర్, పెద్దింటి అశోక్ కుమార్, గుడిపల్లి నిరంజన్, గోర్ల బుచ్చన్న, పొన్నాల బాలయ్య, దాసోజు కృష్ణమాచారి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి,
సుంకర రమేశ్, బిల్లా మహేందర్.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్