Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 04 2026

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:21 AM

అభినందన సభ, కథా, కవితా రచనపై కార్యశాల, సింగమనేని నారాయణ ‘సర్వలభ్య రచనల సంపుటం’, వార్షిక కవి సమ్మేళనం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 04 2026

అభినందన సభ, కథా

నందిని సిధారెడ్డి ‘అనిమేష’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, కవి వారం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20 రాత్రి 7:30 గంటలకు ఆన్‌లైన్‌లో అభినందన సభ జరుగుతుంది. ఈ సభలో వేణు నక్షత్రం, ఏనుగు నరసింహారెడ్డి, కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ పాల్గొంటారు. వివరాలకు: 94401 19245.

కందుకూరి శ్రీరాములు

కథా, కవితా రచనపై కార్యశాల

యువ రచయితల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాచ్యపరిశోధనా సంస్థ సౌజన్యంతో, సాహితీ స్రవంతి–వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యశాల ఏప్రిల్ 28 ఉదయం 9:30 నుంచి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో జరుగుతుంది. ప్రధాన వక్తలుగా రాజేశ్వరమ్మ, కెంగార మోహన్, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, పలమనేరు బాలాజీ, మధురాంతకం నరేంద్ర, పి.సి. వెంకటేశ్వర్లు, ఆర్.సి. కృష్ణస్వామి రాజు పాల్గొంటారు. ఆసక్తి ఉన్న యువ రచయితలు ఏప్రిల్‌ 25 లోపు 93980 00686 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలి.

మల్లారపు నాగార్జున

సింగమనేని నారాయణ ‘సర్వలభ్య రచనల సంపుటం’

సింగమనేని నారాయణ ‘సర్వలభ్య రచనల సంపుటం’ తీసుకురావాలని సంకల్పించాము. ఆయన రాసిన సాహిత్యపరమైన ఉత్తరాలు, వ్యాసాలు, ప్రసంగ పాఠాలు, సమీక్షలు, అభినందనలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు... ఏవైనా సరే మీ వద్ద ఉంటే స్కాన్ చేసి 94412 87865కు వాట్సాప్ లేదా sannapureddy12@gmail.comకు ఈమెయిల్‌ ద్వారా పంపగోరుతున్నాము.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వార్షిక కవి సమ్మేళనం

సూర్యాపేట చారిత్రక సాహితీ వాహిని ఆహ్వానంతో మనమ్‌ వికాస వేదిక నిర్వహణలో కవిరాజ్‌ స్మారక 58వ వార్షిక కవి సమ్మేళనం ఏప్రిల్‌ 21 సాయంత్రం 4 గంటలకు సుధాబ్యాంక్‌ మినీ ఆడిటోరియం, సూర్యా పేటలో జరుగుతుంది. ముందుగా వచ్చినవారికి మాత్రమే అవకాశం. ముఖ్య అతిథి హెచ్చార్కె, విశిష్ట అతిథి మీలా మహదేవ్‌, అధ్యక్షులు గణేష్‌ పెద్దిరెడ్డి. కవిరాజ్‌ పురస్కా రాన్ని గుడిపాటి స్వీకరిస్తారు. తుల శ్రీనివాస్‌ ‘పచ్చబొట్టు’ కవిత్వ సంపుటి ఆవిష్కరణ ఉంటుంది. ఈ పుస్తకాన్ని సాగర్ల సత్తయ్య సమీక్షిస్తారు.

గణేష్‌ పెద్దిరెడ్డి

ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 02:21 AM