సమాజాన్ని ప్రశ్నించండి మార్పుకోసం పోరాడండి
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:44 AM
తెలుగు సాహిత్య చరిత్రలో కాలాన్ని మలిచే శక్తికి సాక్షిగా నిలిచిన మహాకవి.. శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ). సంప్రదాయ పద్య రచనల నుంచి బయటకు వచ్చి, ప్రజల జీవితాన్ని, వారి బాధలను...
తెలుగు సాహిత్య చరిత్రలో కాలాన్ని మలిచే శక్తికి సాక్షిగా నిలిచిన మహాకవి.. శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ). సంప్రదాయ పద్య రచనల నుంచి బయటకు వచ్చి, ప్రజల జీవితాన్ని, వారి బాధలను, పోరాటాన్ని కవిత్వంలో ప్రతిబింబించిన మహానుభావుడు. శ్రీశ్రీ కవిత్వం ఒక ఉద్యమం. ఆయన రచనలు సామాజిక అసమానతలపై తిరుగుబాటు. పేదల కష్టాలు, కార్మికుల జీవన సంగ్రామం, సమాజంలోని అన్యాయాలు ఆయన సాహిత్యంలో ప్రతిఫలించాయి. ఈ కవితా సంకలనం కేవలం సాహిత్యానికి మాత్రమే కాదు, సమాజానికి ఒక దిశానిర్దేశం చేసింది. పాత సామాజిక వ్యవస్థలను సవాల్ చేస్తూ, కొత్త ప్రపంచాన్ని కలగంటూ శ్రీశ్రీ తన కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించారు. ఆయన వచన కవిత్వం సాధారణ ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపింది. కవిత్వం అనేది కులీనవర్గాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి గుండెల్లో చోటు సంపాదించింది. శ్రీశ్రీ భావజాలం సినిమాలు, నాటకాలు, ప్రజా ఉద్యమాలపై గాఢంగా ప్రభావం చూపింది. తెలుగు సినిమా పాటలలో కూడా ఆయన విప్లవాత్మక భావాలు ప్రతిఫలించాయి. నేటికీ సమాజంలో అసమానతలు, అన్యాయాలు కొనసాగుతున్నాయి. అందుకే శ్రీశ్రీ కవిత్వం మరింత ప్రాసంగికంగా మారింది. శ్రీశ్రీ మనకు ఇచ్చిన సందేశం ఒక్కటే– ‘‘సమాజాన్ని ప్రశ్నించండి, మార్పు కోసం పోరాడండి.’’
ఎల్లబోయిన వెంకటేశ్వర్లు
(నేడు శ్రీశ్రీ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News