Share News

ఆరేళ్ళ బాలకృష్ణుడు – రెండు వటవృక్షాలు

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:35 AM

వికసిత భారత్‌లో వికసించనివ్వని పుష్పాన్ని నిలదీతల సకశేరున్ని నిక్కచ్చిగా చేస్తున్నానొక స్వతంత్ర ప్రకటన...

ఆరేళ్ళ బాలకృష్ణుడు – రెండు వటవృక్షాలు

వికసిత భారత్‌లో

వికసించనివ్వని పుష్పాన్ని

నిలదీతల సకశేరున్ని

నిక్కచ్చిగా

చేస్తున్నానొక

స్వతంత్ర ప్రకటన

అవునవును నే

దిమాఘీ ఖరాబీ

కానైతే గులామీ

మత కుల గంతల

వాలు కుర్చీ భద్ర జీవులు

పడకేసి నేస్తుంటారు

వకాల్తా కవితలు

రాజ్యం పట్ల

ఘంటము చేబూని

జనం మీద దాష్టికాల్ని

కాంచ నిరాకరిస్తరు

కొత్త తరం స్వరం

శ్రుతి తప్పిందని

నేరుగా తీర్పులిస్తరు

పేరేదైతేనేం

అర్బన్ నక్సల్

దిమాఘీ నక్సల్

ఆలోచనల్ని ఎక్కుపెట్టి

ప్రశ్నశరాల్ని సంధిస్తాను

సంభాషణకు ధీముడి వేస్తే

వ్యంగ గంగై పారుతాను

ప్రశ్నే మనుగడ

ప్రశ్నే పురోగతి

మాయ పొరలు కమ్మిన

మనస్సాక్షిని తట్టి

నట నిద్రను లేపడం

తోటివారి పట్ల

కరుణ కలగమనడం

విభజన నిర్మాణం మాని

ఐక్యత చేయి చాపమనడం

ద్వేష రహిత దేశం

దిమాఘీ నక్సలిజం

అయితేనేం

ప్రశ్నించే బొద్దింక

వెన్నుముక లేని

మనిషి పుట్టువడి కన్న...

పిన్నంశెట్టి కిషన్

97002 30310

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 01:35 AM