Share News

నిశ్శబ్దంగా దహిస్తున్న ‘స్టూడెంట్ బర్నౌట్’

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:13 AM

నేటి విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువు కంటే బాధ్యతల బరువు, ఆశయాల ఒత్తిడి విద్యార్థిని ఎక్కువగా కుంగదీస్తున్నాయి. ఉదయం సూర్యోదయానికి ముందే మొదలయ్యే అక్షరాల యుద్ధం...

నిశ్శబ్దంగా దహిస్తున్న ‘స్టూడెంట్ బర్నౌట్’

నేటి విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువు కంటే బాధ్యతల బరువు, ఆశయాల ఒత్తిడి విద్యార్థిని ఎక్కువగా కుంగదీస్తున్నాయి. ఉదయం సూర్యోదయానికి ముందే మొదలయ్యే అక్షరాల యుద్ధం, అర్ధరాత్రి వరకు సాగే హోంవర్క్‌లు, వీకెండ్ పరీక్షలు.. వెరసి విద్యార్థి ఒక యంత్రంలా మారిపోతున్నాడు. ఈ క్రమంలోనే ‘స్టూడెంట్ బర్నౌట్’ అనే ఒక నిశ్శబ్ద మహమ్మారి విద్యార్థి లోకాన్ని కబళిస్తోంది. ఒకప్పుడు చదువు అంటే విజ్ఞానం, వికాసం. కానీ నేడు అది కేవలం ఒక ర్యాంకు! ఈ పరుగు పందెంలో గెలవాలనే తపనలో విద్యార్థులు తమ సహజత్వాన్ని, సృజనాత్మకతను, ఆఖరికి మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తూ మన సమాజం, విద్యాసంస్థలు విద్యార్థుల మార్కులపై చూపే శ్రద్ధ వారి మానసిక స్థితిపై చూపడం లేదు. తరగతి గదిలో వెనుకబడిపోతున్నామనే భయం, తోటి విద్యార్థులతో పోలికలు, తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు విద్యార్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం విశ్రాంతి లేని విద్యా ప్రణాళికలే. ఈ వినాశకరమైన బర్నౌట్ స్థితి నుంచి విద్యార్థులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప, చదువే జీవితం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విద్యార్థులకు తగినంత నిద్ర, క్రీడలు, ప్రకృతిలో గడిపే అవకాశం కల్పించాలి. విద్యాసంస్థలు సైతం కేవలం సిలబస్ పూర్తి చేయడంపైనే కాకుండా, విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యమిచ్చేలా విద్యా క్యాలెండర్‌ను రూపొందించాలి.

మర్రాపు వసుంధరాదేవి, టీచర్

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 12:13 AM