Sankranti Celebrations: స్వాగతించుదునిపుడు సంతసమున
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:02 AM
సంక్రాంతి పండగ సౌభాగ్య సంపద, భోగి భాగ్యములందు బలిమి కూర్చు, కొత్త ధాన్యము పంట కలిసి వచ్చెగనంట...
సంక్రాంతి పండగ- సౌభాగ్య సంపద,
భోగి భాగ్యములందు- బలిమి కూర్చు,
కొత్త ధాన్యము పంట- కలిసి వచ్చెగనంట,
పుష్య మాసపు లక్ష్మి- పూజ చేయ,
నల్ల తిలబియ్యంబు-నెయ్యి కలిపిన వంట,
అర్పించి మొక్కెద- ఆరగించు
గాలిపటములెల్ల- గగనతలమునందు,
రంగవల్లిరథం- రత్నరాసి..
ఔర సంక్రమణ శుభవేళ హరిని సిరిని,
దివ్య గానమే హరిదాసు దీవెనెంతో,
స్వాగతించుదునిపుడు- సంతసమున
తెల తెలవారంగనే తెలుగుతావు
వరకాల యాదగిరి
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..