Share News

Sankranti Poem: ముగ్ధమోహన రాగసుధ

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:56 AM

మంచు ముత్యపు పిలుపునందిన పుష్యమాసపు పడతి వధువై మహీతలపు ప్రణయ వేదిక ముగ్ధమోహన రాగసుధగా...

Sankranti Poem: ముగ్ధమోహన రాగసుధ

మంచు ముత్యపు పిలుపునందిన

పుష్యమాసపు పడతి వధువై

మహీతలపు ప్రణయ వేదిక

ముగ్ధమోహన రాగసుధగా

సంకురాతిరి మరల వచ్చెను

కృషికి ఫలితము చేతికందగ

రైతుబిడ్డకు ముదము హెచ్చెను

జియ్యరయ్యకు చేవవచ్చెను

తిరుప్పావై మధువుపంచగ

సంకురాతిరి శుభము పలికెను

సకల మానవోన్నతికై

కానీ–

గంగిరేడుల వినుతి హెచ్చిన

గంగిరెద్దుల గుణము పోవలె

అభ్యుదయపు విలువ తెలిసిన

శాంతి పథమె మనది కావలె

భోగిమంటలు నింగికెగసిన

భాగ్యమేమియు కూడి రాదు

ఆ అగ్నిజ్వాలల దహనమవవలె

అంతరంగపు కలుషమంతయు

అపుడె జాతికి తేజ మొదవును

భాగ్యరాసులె పొంగి పొరలును

ప్రజల రాజ్యమె వెలసినపుడదె

నిక్కమగు సంక్రాంతి పర్వము

పింగళి పాండురంగారావు

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 12:56 AM