ఆచరించాల్సిన మాట!
ABN , Publish Date - May 15 , 2026 | 01:04 AM
ప్రధాని చెప్పిన బంగారం కొనద్దన్న మాట ప్రస్తుతం దేశం ఆచరించాల్సిన బాట. ఒకప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ‘ఒక పూట తిండి మానేస్తే దేహానికీ, దేశానికీ మంచిది’ అని పిలుపునిచ్చారు...
ప్రధాని చెప్పిన బంగారం కొనద్దన్న మాట ప్రస్తుతం దేశం ఆచరించాల్సిన బాట. ఒకప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ‘ఒక పూట తిండి మానేస్తే దేహానికీ, దేశానికీ మంచిది’ అని పిలుపునిచ్చారు. దేశంలో ఆహార ఉత్పత్తి చాలక, దిగుమతులు భారమైన స్థితిలో అప్పటి ఆహార భద్రతకి ఊతమిచ్చే సందేశం అది. ఇప్పుడు ప్రధాని మోదీ ఏడు ఆర్థిక అంశాలు దేశ ప్రజల్ని పాటించమని ఒక సభలో చెప్పారు. అందులో ఒకటి బంగారం కొనడం ఒక ఏడాది పాటు మానెయ్యమని. అలాగే వంటనూనెల వాడకాన్ని తగ్గించమని, పెట్రోల్ వాడకం తగ్గించడానికి కార్ పూలింగ్ లాంటివి పాటించమని, ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచమని, ప్రయాణాలు తగ్గిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అవకాశాల్ని వెదకమని ఇలాంటి సూచనలు కూడా మంచివే కానీ అమలు చెయ్యాలంటే ఆ తరహా వ్యవస్థని అంచెలవారీగా నిర్మించాలి. ఉదాహరణకు ప్రజా రవాణా వ్యవస్థ దశలవారీగా మెరుగుపరిస్తే అందరూ అటువైపు మళ్లే అవకాశం ఉంటుంది. ప్రధాని ఇలా సూచనలు చెయ్యడానికి ముఖ్య కారణం విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనై ధరలు మండిపోతున్నాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించాల్సిన అవసరం ముంచుకొస్తుంది. యుద్ధాలు, ఇతర విధాన మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలౌతుంది. ఖచ్చితంగా పాటించాల్సినవే. ఆ దెబ్బ తీవ్రత తగ్గించుకునే మార్గాలివి. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వం అన్ని వేళలా ఆలోచించాల్సినవి.
డి.వి.జి శంకరరావు
ఇవీ చదవండి:
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?