Share News

శూన్యంలో లేఖనం

ABN , Publish Date - May 25 , 2026 | 01:23 AM

ప్రతీక్షించే కళ్ళలో గుప్తాశ్రువు బరువు బూరుగు కాయవలె పగిలిన రాత్రిలో చెల్లాచెదురైన...

శూన్యంలో లేఖనం

ప్రతీక్షించే కళ్ళలో గుప్తాశ్రువు బరువు

బూరుగు కాయవలె పగిలిన రాత్రిలో

చెల్లాచెదురైన చుక్కలెన్నటికీ కలవవు

ఫలించని ప్రేమ పొద్దుతిరుగుడు పువ్వు

బహుదూరపు పథికుడి పయనమంతటా

శూన్యంలో తర్జని పరిపరి వ్రాసి చెరిపిన

వియోగగీతిక అలలు విరిగిపడే నురుగు

వెనుదిరిగే భుజాన సంచిలో ఒక రసశిల

నీ చిరకాలపు చెలికాడు కోకిల మాదిరిగా

వదిలి వెళుతున్నాడు నువ్వుండే తావుని

అతడు నిన్ను తోడ్కొనిపోయే ఊహాలోకం

సీతాకోకచిలుక రెక్కలకన్నా తేలికపాటిది

నామాడి శ్రీధర్

93968 07070

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 25 , 2026 | 01:23 AM