ఒకానొక నిత్యసత్యం
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:34 AM
ఒక్కొక్కరు పై చదువులకోసమని ఇంటిని వదిలెళ్తున్నారు కడదాకా ప్రయాణించకుండా వారి వారి స్టేషన్‌లో దిగిపోయే...
ఒక్కొక్కరు
పై చదువులకోసమని
ఇంటిని వదిలెళ్తున్నారు
కడదాకా ప్రయాణించకుండా
వారి వారి స్టేషన్‌లో దిగిపోయే
ఆత్మీయుల్లాగా
మొన్న పెద్దోడు
నిన్న చిన్నోడు
వాళ్ళు వేసే
మొదటి అడుగు బయటపడింది
చదువు పూర్తయ్యాక వేసే అడుగులు
మరి ఎటువైపో
అప్పుడూ ఇద్దరమే
ఇప్పుడూ ఇద్దరమే
ఇద్దరు
ముగ్గురయ్యేది
నలుగురయ్యేది
కొంతకాలమే
ఉన్నంతకాలమే పండుగ
ఇద్దరు
ఒక్కరు
ఆ ఒక్కరు
వక్కలు ముక్కలు
నిలువుగా చీలిపోవటమే
జీవితం
వచ్చినచోటుకి తిరిగెళ్ళటమే
ఒకానొక నిత్యసత్యం
తండ హరీష్
89784 39551
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..