Share News

నిరీహ

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:37 AM

వెన్నెముకపై నిలబెట్టిన ఆకాశపు డేరాకింద అశాంత సమయాల అవస్థని పాతిపెట్టి విరామచిహ్నాల మధ్య..

నిరీహ

వెన్నెముకపై నిలబెట్టిన

ఆకాశపు డేరాకింద

అశాంత సమయాల

అవస్థని పాతిపెట్టి

విరామచిహ్నాల మధ్య

విలపించే మలిన ఆత్మలు

గడ్డకట్టిన పెదాలతో

పాడే ఆర్తగీతం వింటూ

మధుక్లేశాల

మౌనభాషణలతో నిండిన

రాత్రుల దీర్ఘ సంతకాన్ని

రెప్పలపై వేలాడేస్తూ...

...ఏమీ చూడలేనిపుడు

కనుగుడ్లు కరిగించిన నిర్మోహిని

ఏమీ మాట్లాడలేనిపుడు

నాలుకని హత్య చేసిన నిర్దోషిని

మల్లారెడ్డి మురళీమోహన్

88611 84899

ఈ వార్తలనూ చదవండి:

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

Updated Date - Aug 17 , 2026 | 03:37 AM