నదీప్రవాహమంతా...
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:48 AM
ఈ ప్రయాణమంతా మబ్బుల నీడల్లో దాగుడుమూతల్లో ఆకాశం విచ్చుకునేదాకా, నదీప్రవాహమంతా..
ఈ ప్రయాణమంతా
మబ్బుల నీడల్లో
దాగుడుమూతల్లో
ఆకాశం విచ్చుకునేదాకా,
నదీప్రవాహమంతా
కొండలు కోనల్ని వొరుసుకుంటూ
పరవళ్లు తొక్కే సహజీవనమంతా
సుదూరంగా
మహాసముద్రం పిలిచేదాకా,
హిమాద్రిలోని శైశవాన్ని
తిరిగి చూడాలన్నా
వెనక్కి ప్రవహించని వర్తమానం,
ఇప్పుడిక
మరణాసన్నమనే భయం లేదు
సొంతమంతా సంలీనమే,
మహోధృత కెరటాలకెదురేగి
కడలిసాంతం తానేగా
గ్రీష్మరుతురాగాలలో
తనువంతా పవనమై
మబ్బుల్లో ఆడిపాడి
అవనీతలమంతా–
తడిసి మురిసేలా!
నిఖిలేశ్వర్
91778 81201
ఇవి కూడా చదవండి..
ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ