మైనర్ నేరస్థుల వయోపరిమితిని తగ్గించాలి
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:34 AM
మైనర్ నేరస్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న కేరళ హైకోర్టు ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు...
మైనర్ నేరస్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న కేరళ హైకోర్టు ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మారుతున్న సమాజం, పెరుగుతున్న నేర స్వభావం, బాధితులకు న్యాయం అనే కోణాల్లో చట్టసభలు నిశితంగా పరిశీలించాల్సిన విషయమిది.
గత తరాలతో పోల్చితే నేటి పదహారేళ్లవాడిని పిల్లవాడు అనలేం. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రపంచంలో అతడు మంచి–చెడుల గురించి విస్తృత అవగాహన పొందుతున్నాడు. డ్రగ్స్, ఆయుధాలు, వాహనాలు, సైబర్ నేరాలు వంటి ప్రమాదకర ప్రపంచం కూడా అతడికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తీవ్రమైన, ముందస్తు ప్రణాళికతో కూడిన నేరాలకు పాల్పడిన వారిని కేవలం వయసు ఆధారంగా పూర్తిగా బాధ్యత నుంచి మినహాయించడం సముచితమేనా?
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం మైనర్లపై నమోదయ్యే కేసుల్లో గణనీయమైన వాటా 16–18 సంవత్సరాల వయస్సు వారిదే. నిర్భయ కేసులోనూ, పూణే పోర్షే ప్రమాదంలోనూ పద్దెనిమిదేళ్ల లోపు వారు నిందితులుగా ఉన్నారన్న విషయం గుర్తించాలి. నేరం చేసినవారి వయసు మాత్రమే కాకుండా, నేర తీవ్రత, ఉద్దేశం, మానసిక పరిపక్వతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాలం మారినప్పుడు చట్టం కూడా సమాజ వాస్తవాలకు అనుగుణంగా మారాలి.
కొలను వెంకటేశ్వరరెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్