మృత్యుద్వారం మాంజా దారం!
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:09 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గొట్టపుబావులు తవ్వినప్పుడు అందులో జలం లభ్యంకాకపోతే, ఆ గొట్టాలను కానీ, వాటి వల్ల ఏర్పడ్డ పెద్ద రంధ్రాలను కానీ కప్పివేయకుండా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గొట్టపుబావులు తవ్వినప్పుడు అందులో జలం లభ్యంకాకపోతే, ఆ గొట్టాలను కానీ, వాటి వల్ల ఏర్పడ్డ పెద్ద రంధ్రాలను కానీ కప్పివేయకుండా వదిలేసే వారు. చిన్నారులు ఆటలాడుకుంటూ అక్కడ ఆ రంధ్రాల గురించి తెలియక అందులో పడి మరణించేవారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తగ్గాయి. ఇప్పుడు ‘మాంజా’ దారం మృత్యువుకు ద్వారంగా మారుతోంది. సంక్రాంతి పండుగ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా తెలంగాణలో పతంగుల ఎగరేయడానికి పిన్నలతో పాటు పెద్దలు కూడా సరదాపడుతుంటారు. కానీ ఈ వినోదం కొన్ని కుటుంబాల్లో విషాదం మిగులుస్తోంది. దారానికి గాజు రజను అంటించడం వల్ల రహదారిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి గొంతులు కోసుకుపోయి మరణిస్తున్నారు. మాంజా అమ్మకాలపై అధికారులు నిఘా ఉంచాలి. అలాగే పెద్దలు తమ పిల్లలకు మాంజా వల్ల జరుగుతున్న మరణాల గురించి వివరించాలి. మాంజాని అమ్మే వ్యాపారులపై భారీ జరిమానాతో పాటు కఠినశిక్షలు పడేలా కేసులు పెట్టాలి. పోటీగా ఎగురుతున్న గాలి పటాన్ని కూల్చే యత్నంలో ఈ మాంజా కొందరి ప్రాణాలనే బలిగొంటోంది. ఒకరి ఆనందం వేరొకరికి జీవితకాలం బాధను కలిగిస్తోంది.
మారిశెట్టి జితేంద్ర
రాజమహేంద్రవరం
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..
యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం