‘మాదిరాజు’ రచనల ఆవిష్కరణ సభ
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:37 AM
గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేస్తున్న సంస్థ విశ్వనాథ సాహిత్య పీఠం. ఒక మహాకవి పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికి 100కి పైగా విశిష్ట గ్రంథాలను ప్రచురించి తెలుగు భాషా సాహితీ సేవలో..
గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేస్తున్న సంస్థ విశ్వనాథ సాహిత్య పీఠం. ఒక మహాకవి పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికి 100కి పైగా విశిష్ట గ్రంథాలను ప్రచురించి తెలుగు భాషా సాహితీ సేవలో ఒక చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కీర్తిశేషులు ఆచార్య మాదిరాజు రంగారావుగారితో పీఠానికి గాఢమైన అనుబంధం ఉంది. వారు నిరంతరం పీఠాన్ని సందర్శిస్తూ, అది చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ, తమ చిరునవ్వుతో అభినందించిన సందర్భాలను ఎప్పటికీ మరచిపోలేము. అందుకే, వారి స్మృత్యర్థం, వారి శతాధిక కావ్యరచనా ప్రపంచాన్ని స్మరించుకునేందుకు విశ్వనాథ సాహిత్యపీఠం... ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.
విశ్వనాథ సాహిత్యపీఠం, హైదరాబాద్; ఆచార్య మాదిరాజు రంగారావు ‘రసధుని’ సాహిత్య పరిషత్తు (ట్రస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో రంగారావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ‘సాహితీ వైజయంతి’, ‘స్వేచ్ఛాకవిత్వం’, ‘సాహిత్య విమర్శ’ పుస్తకావిష్కరణ సభ జూలై 11న జరగనున్నది. హైదరాబాద్ బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్ గ్రీన్‌పార్క్ రెసిడెన్సీ హాల్‌లో సాయంత్రం 4.30 జరిగే ఈ సభలో ముఖ్య అతిథి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, విశిష్ట అతిథి పి.విజయ్‌బాబు. డా. వెల్చాల కొండలరావు సభాధ్యక్షత వహిస్తారు. మాదిరాజు సంతోష్‌కుమార్, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, జస్టిస్ మంగారి రాజేందర్ (జింబో), ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్, డాక్టర్ ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్, శంకర నారాయణ, ఆత్రేయ శర్మ, డా. వైదేహి శశిధర్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య పిల్లలమర్రి రాములు, డా. నాళేశ్వరం శంకరం, ఆచార్య రామాచంద్రమౌళి, డా. ఏల్చూరి మురళీధర్‌రావు, కొంపెల్ల కామేశ్వరరావు, డా. గండ్ర లక్ష్మణరావు, ‘లయన్’ తమ్మెర లక్ష్మీనరసింహారావు, ఆచార్య కరిమిండ్ల లావణ్య, దేవులపల్లి హరిత, డా. మాదిరాజు చరిత, ఆచార్య కె.యాదగిరి ఈ సభలో పాల్గొంటారు.
బొండా వెంకటప్రసాద్
ఈ వార్తలనూ చదవండి:
చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం
ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..