Share News

Liberation as Poetry: విమోచనం

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:37 AM

మేఘాలు తమను తాము విముక్తం చేసుకోవటానికి వర్షమై కురుస్తాయి పొదుగులు తమ విడుదల కోసం...

Liberation as Poetry: విమోచనం

మేఘాలు

తమను తాము

విముక్తం చేసుకోవటానికి

వర్షమై కురుస్తాయి

పొదుగులు

తమ విడుదల కోసం

ఆకలిగొన్న శిశువుల

పెదాలపై ఒదుగుతాయి

స్వరపేటిక

తన విముక్తిని

చెవులారా వినేందుకు పాటల్ని

రసప్లావిత హృదయాల్లోకి

రవాణా చేస్తుంది

కవి

తన నుండి తను విడివడి

సర్వ స్వతంత్రుడయ్యేందుకు

పడుతున్న పెనుగులాటే

చివరికి కవిత్వమై అలరారుతుంది

నలిమెల భాస్కర్

ఇవి కూడా చదవండి:

జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన

కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

Updated Date - Jan 12 , 2026 | 12:37 AM