Share News

వారసత్వ రైతులకు అన్యాయం!

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:43 AM

రాష్ట్రంలో జరుగుతున్న భూ రీసర్వేలో ఒక డివిజన్ లేదా సబ్ డివిజన్‌లో ఆధునిక రోవర్ ద్వారా కొలతలు నిర్వహించినప్పుడు...

వారసత్వ రైతులకు అన్యాయం!

రాష్ట్రంలో జరుగుతున్న భూ రీసర్వేలో ఒక డివిజన్ లేదా సబ్ డివిజన్‌లో ఆధునిక రోవర్ ద్వారా కొలతలు నిర్వహించినప్పుడు పాత కొలతలకు భిన్నంగా భూమి అలవెన్స్‌గా తగ్గితే (దీన్ని ఎకరాకు 5 సెంట్లుగా నిర్ణయించారు) దాన్ని ఆ ప్రాంతంలోని రైతులందరికీ దామాషాగా పంచడం లేదు. డాక్యుమెంట్లు కలిగిన వారికి యథాతథంగా ఉంచి, తగ్గిన భూమి మొత్తాన్ని డాక్యుమెంట్స్ లేని వారసత్వ ఆస్తిపరులపైనే వేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అనేక చోట్ల జరుగుతున్నది. ఆధునిక కొలతల వల్ల తగ్గిన ఆ మొత్తాన్ని ఆ డివిజన్ లేదా సబ్ డివిజన్‌లోని భాగస్వాములందరికీ దామాషాగా పంచి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి. కానీ డాక్యుమెంట్స్ కలిగివున్న రైతులకు అందులో ఉన్న ప్రకారం పాసుపుస్తకంలో ఎక్కించి ఇచ్చి, తరుగునంతా వారసత్వంగా భూమి కలిగిన వారిపై వేసి పాసుపుస్తకాలు ఇస్తున్నారు. ‘మీరే తేల్చుకోండి’ అని స్థానిక అధికారులు రైతులకే వదిలేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని పై స్థాయి అధికారులు గుర్తించి, సుదీర్ఘకాలం పాటు వివాదాలు కొనసాగే అవకాశం ఉన్న ఇలాంటి చర్యలను అడ్డుకునేలా నిర్ణయాలు తీసుకోవాలి. అలవెన్స్‌గా తగ్గిన భూమిని ఆ డివిజన్ లేదా సబ్ డివిజన్‌లోని భాగస్వామ్య రైతులందరికీ దామాషాగా పంచేలా నిర్ణయం తీసుకుని, కింది స్థాయి అధికారులు కచ్చితంగా అమలుపరిచేలా ఉత్తర్వులు ఇవ్వాలి.

జి. రమాదేవి, గుంటూరు

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 04:43 AM