Share News

లాక్ చేయబడింది

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:56 AM

జవం జారిపోతున్న జీవం లేని జనులు లోన ఎండిపోయినా పైకి ప్రకటిస్తున్న పచ్చదనం స్పందనలన్నీ పనికిరాని పరికరాలు...

లాక్ చేయబడింది

జవం జారిపోతున్న

జీవం లేని జనులు

లోన ఎండిపోయినా

పైకి ప్రకటిస్తున్న పచ్చదనం

స్పందనలన్నీ

పనికిరాని పరికరాలు

కళ్ళకు కాళ్ళకు అడ్డం పడుతూ

అనుమాన మతం

రోబోట్‌ని కూర్చినట్టు

విరిగిన మనిషిలో మనిషిని

ఏర్చి కూర్చాలి.

పరిచయ మొకాల మీద

అపరిచిత నవ్వులు

మనసుల ముచ్చట

అనాథ తచ్చాట

ఒక్కక్కడూ ఒక్కొక్క

లాక్డ్ పాస్‌వర్డ్

ఉరుకుల పరుగుల నిచ్చెనాటల్లో

రాలిపోతున్న మనిషి

పి. శ్రీనివాస్ గౌడ్

99494 29449

ఇవి కూడా చదవండి

వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Updated Date - Mar 23 , 2026 | 12:57 AM