Share News

భారత్‌ ఈయూ ఒప్పందం ఉభయతారకం

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:41 AM

భారత్, యూరోపియన్ యూనియన్ నడుమ తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్ని విధాలా ఘనం.. ఉభయ తారకం. మన ప్రధాని వర్ణించినట్టు...

భారత్‌ ఈయూ ఒప్పందం ఉభయతారకం

భారత్, యూరోపియన్ యూనియన్ నడుమ తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్ని విధాలా ఘనం.. ఉభయ తారకం. మన ప్రధాని వర్ణించినట్టు ఇది అన్ని ఒప్పందాలకు తల్లి లాంటిదే. మిత్ర, శత్రు భేదం చూపించకుండా అమెరికా అందరినీ తన సుంకాల పెంపు తర్జన చూపించిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం కుదుపునకు లోనైంది. అందుకు భారత్‌, ఈయూ కూడా మినహాయింపేమీ కాదు. ఈ స్థితిలో మూలపడి ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు బూజు దులిపి క్రియాశీలకం చేయడం అవసరమయింది. ప్రపంచ జీడీపీలో 25 శాతం కలిగిన ఈ భాగస్వాములూ తమ తమ సుంకాల్ని దశలవారీగా దాదాపు ఎత్తివేయడం వల్ల లాభం పొందుతాయి. ఈ ఒప్పందం శీఘ్రంగా కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.

– డా. డి.వి.జి. శంకర రావు

ఇవి కూడా చదవండి

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

Updated Date - Jan 29 , 2026 | 02:41 AM