Share News

Impermanence of Emotions: అనిత్య

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:40 AM

నల్లమబ్బై భారంగా కదిలిన నిన్నటి మనసే సెలయేటి మీద వాన చినుకై తుళ్ళి పడుతోంది...

Impermanence of Emotions: అనిత్య

1.

నల్లమబ్బై

భారంగా కదిలిన

నిన్నటి మనసే

సెలయేటి మీద

వాన చినుకై

తుళ్ళి పడుతోంది

నేడు

మళ్ళీ ఇదే చినుకు

మరో భారమై

మేఘంగా

రేపు

అనిత్య అనిత్య అనిత్య అని

అనవరతం ఘోషిస్తూ అతను!

మూలా సుబ్రహ్మణ్యం

ఇవి కూడా చదవండి:

జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన

కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

Updated Date - Jan 12 , 2026 | 12:40 AM