Share News

A Poetic Reflection on Togetherness: అంతే చాలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:17 AM

నువ్వూ నేనూ చేతులు కలిపిన చోట కాకినాడ సముద్రపాకంలో కాజా నీ గుప్పిడి మీద నా గుప్పిడి...

A Poetic Reflection on Togetherness: అంతే చాలు

నువ్వూ నేనూ చేతులు కలిపిన చోట

కాకినాడ సముద్రపాకంలో కాజా

నీ గుప్పిడి మీద నా గుప్పిడి

ఒకరి చేతిమీద ఒకరు

అలా పెంచుకుంటూ పోతామా

ప్రత్యక్షమౌతుంది గుప్పిళ్ల పర్వతం.

దాన్తోనే చిలుకుతాం విశాఖ పాల సముద్రం

గరళామృతాన్ని కాక్‌టెయిల్ చేసుకు తాగేస్తాం

విరగబడే నవ్వులూ వెక్కిళ్లతో ఏడుపులూ

గోడల మీద మన నీడల మధ్య

తూలుతూ ఉన్మత్తంగా ఆడుతూ

ఒకరి జాన మీద మరొకరి జాన

అలా పేర్చుకుంటూ పోతే దీపాల చెట్టు

ఎప్పుడైనా సరే

రెండు చేతులు ఒక ఊహని సృష్టించినపుడు

చేతుల పర్వతం మీద దీపాల చెట్టు విరగబూస్తుంది

కావల్సినన్ని దీపాలు కోసుకుని

ఊరు ఊరుకీ నక్షత్రాల్ని పంచుకుంటూ రావచ్చు

ఆడుకోడానికి అలా ఉంచు

నా చేతి మీద నీ చెయ్యి

నా జాన మీద నీ జాన, అంతే చాలు

వసీరా

91777 27076

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 02:17 AM