Share News

కనీస పెన్షన్‌ పెంపు ఎప్పుడు?

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:13 AM

‘జేపీకి ఇంత అమానవీయ ఆలోచనా?’ అని అక్టోబరు 16న ఆంధ్రజ్యోతిలో రాజేంద్రబాబు అర్విణి రాసిన వ్యాసానికి పొడిగింపుగా ఇది రాస్తున్నాను. వారు ఈపీఎస్ 95 పెన్షన్‌ పేరు రాయక పోయినా...

కనీస పెన్షన్‌ పెంపు ఎప్పుడు?

‘జేపీకి ఇంత అమానవీయ ఆలోచనా?’ అని అక్టోబరు 16న ఆంధ్రజ్యోతిలో రాజేంద్రబాబు అర్విణి రాసిన వ్యాసానికి పొడిగింపుగా ఇది రాస్తున్నాను. వారు ఈపీఎస్ 95 పెన్షన్‌ పేరు రాయక పోయినా దీని గురించి ప్రస్తావించారు. దేశంలో నష్టాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను 2002 నుంచి మూత వేసి ఉద్యోగులను బలవంతంగా వాలెంటరీ సపరేషన్ స్కీమ్ (వీఎస్ఎస్) కింద తొలగించారు. వెయ్యి రూపాయల లోపు వచ్చే వీరి పెన్షన్‌ను 2014లో బీజేపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలకు పెంచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పెన్షను వస్తోంది. వీరికి డీఏ పెంపు గాని, వైద్య సదుపాయం గాని లేవు. గత పదేళ్లుగా అనేక మంది పార్లమెంటు సభ్యులు నిలకడగా ఇస్తున్న ఈ పెన్షన్‌ పెంచమని చట్టసభలలో ప్రభుత్వానికి సూచిస్తూ వినతి పత్రాలు ఇచ్చారు. పార్లమెంటు కమిటీ కూడా కనీస పెన్షన్‌ను రూ.7,500 చేయాలని, దీనికి కరవు భత్యం, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలని సిఫారసు చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తొలగించిన ఉద్యోగులలో ఈపీఎస్ 95 స్కీము కింద పెన్షన్‌ పొందుతున్న వారు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. వారందరూ 70-80 ఏళ్ళ వయసు దాటినవారే. అనేక శారీరక, మానసిక రుగ్మతలతో నరకం అనుభవిస్తున్నారు. వీరు రాష్ట్రాల ప్రావిడెంట్ ఆఫీసుల వద్ద, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అనేకసార్లు తమ నిరసన తెలియజేశారు. కేంద్ర మంత్రులు పెన్షన్‌ను తప్పక పెంచుతామని హామీలు ఇచ్చారే కాని, అవి ఈనాటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఈ పెన్షనర్లు చాలా మంది గతించారు. ఇంకా కాలయాపన చేయకుండా కనీస పెన్షన్‌ను రూ.7,500 చేయాలని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వీరు అభ్యర్థిస్తున్నారు.

ఎన్‌.ఎస్‌.ఆర్‌. మూర్తి

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 29 , 2026 | 03:13 AM