Share News

ఎముకల కేకలు

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:33 AM

కాలం తొక్కేసిన నడుముల్లో అణచివేతల చరిత్ర మోగుతూనే ఉంది. మాటల్లేక మౌనమై న్యాయంకోసం పోరాడుతోంది. పొలాల్లో వంగిన వెన్నెముకలు...

ఎముకల కేకలు

కాలం తొక్కేసిన నడుముల్లో

అణచివేతల చరిత్ర మోగుతూనే ఉంది.

మాటల్లేక మౌనమై

న్యాయంకోసం పోరాడుతోంది.

పొలాల్లో వంగిన వెన్నెముకలు

పంటకంటే ముందు

బాధనే పండించాయి,

కార్ఖానాల లోపల

శ్వాసకంటే ముందు

శ్రమే ఆయుధమయ్యింది.

రాజ్యాల కిరీటాలు మారాయి,

పతాకాల రంగులు మారాయి,

కానీ

అడుగడుగునా నలిగిన

ఆ ఎముకల లెక్కలు

మాత్రం మారనే లేదు.

చరిత్ర పుస్తకాల్లో

వీరుల పేర్లు మెరుస్తాయి,

కానీ వారిని మోసిన

ఎముకల గూళ్లు పేరు మాత్రం

ఎక్కడా జాడ లేదు!

అవి విరిగినప్పుడు కాదు

విస్మరించబడినప్పుడు

ఎముకలు ఎక్కువగా

బాధపడతాయి.

ఈ కేక

శవాలది కాదు,

బతికే మనుషులది,

శ్వాస ఉన్నా

గొంతు లేని జీవితాలది!

ఎముకల కేకలు

ఇక మౌనంగా ఉండవు

వాటిని విన్న రోజు

మనిషి నిజంగా

మహోన్నతుడు అవుతాడు...

మడియ వల్లభరావు

89850 19884

ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 05:33 AM