Share News

చైనా టపాసులు హానికరం

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:45 AM

దీపావళి పండుగను మనం ఆనందంగా జరుపుకోవాలి. అలాగే దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన దేశంలో సంప్రదాయంగా అనేక జిల్లాల్లో వేలాది బాణసంచా...

చైనా టపాసులు హానికరం

దీపావళి పండుగను మనం ఆనందంగా జరుపుకోవాలి. అలాగే దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన దేశంలో సంప్రదాయంగా అనేక జిల్లాల్లో వేలాది బాణసంచా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటిలో లక్షలాది కార్మికులు ఉపాధి పొందుతూ, కోట్లాది రూపాయల విలువైన బాణసంచా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వీటి ఉత్పత్తిలో కుటీర పరిశ్రమల వాటా అత్యధికం. స్వదేశంలో తయారైన వస్తువులను కొనడం ద్వారా దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. చైనా టపాసులు కాల్చినప్పుడు వెలువడే పొగ, సూక్ష్మ ధూళి కణాలు, ప్రమాదకరమైన రసాయన అవశేషాలు గాలిలో కలుస్తాయి. దీంతో కళ్లల్లో మంట, నీరు రావడం, గొంతు–శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటి ప్రభావానికి గురవుతారు. చైనా టపాసులు కాల్చిన తర్వాత పెద్ద ఎత్తున కాగితపు వ్యర్థాలే కాకుండా, ప్లాస్టిక్ అవశేషాలు, కాలిపోయిన పదార్థాలు బయటపడతాయి. ఇవి పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. అందువల్ల ప్రజలందరూ అక్రమంగా దిగుమతి చేసుకున్న, నాణ్యతలేని, భద్రతా ప్రమాణాలు పాటించని చైనా టపాసులకు దూరంగా ఉండాలి.

దారపు ప్రసాదరెడ్డి

స్వదేశీ వ్యాపారి మంచ్ కన్వీనర్

ఈ వార్తలూ చదవండి

‘పేస్‌’తో కొట్టారు

పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ

Updated Date - Nov 06 , 2026 | 04:45 AM