కృత్రిమ బురద!
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:49 AM
కృత్రిమ మేధని ఉపయోగించి చేసిన వీడియో, ఫోటో లేదా కంటెంట్‌పై స్పష్టంగా లేబిల్ ఉంచాలని సామాజిక మాధ్యమాలను ఆదేశిస్తూ కేంద్రం కొత్త నిబంధనల్ని అమలుపరచబోతున్నది...
కృత్రిమ మేధని ఉపయోగించి చేసిన వీడియో, ఫోటో లేదా కంటెంట్‌పై స్పష్టంగా లేబిల్ ఉంచాలని సామాజిక మాధ్యమాలను ఆదేశిస్తూ కేంద్రం కొత్త నిబంధనల్ని అమలుపరచబోతున్నది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఏఐ జెనరేటెడ్ కంటెంట్ వెల్లువెత్తుతోంది. ఏది వాస్తవమో, ఏది నకిలీనో తెలుసుకోవడం కూడా కష్టమైపోతుంది. ప్రముఖులు మాట్లాడినట్టు చూపించే వీడియోల ద్వారా మరింత నకిలీ సమాచారం చలామణి అయిపోతోంది. ఇది కాక ఆర్థిక మోసాలకు, అమాయకుల్ని వంచించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ కృత్రిమ మేధ అసాంఘిక శక్తులకు ఉపయోగపడడం, అందుకు సామాజిక మాధ్యమాలు వేదిక కావడం మామూలైంది. ఏఐ ఆధారిత దృశ్య సందేశాలపై లేబుల్ ఉంటే కనీసం ‘ఇది నిజం కాదు’ అన్న స్పృహ వీక్షకులకు తడుతుంది.
ఇక వేరే నిబంధనల విషయానికి వస్తే– ఏదైనా కోర్టు, అధికారిక సంస్థ ఫలానా సందేశం హానికరం కాబట్టి తొలగించాలని ఆ సామాజిక మాధ్యమం దృష్టికి తెస్తే, మూడు గంటల్లో ఆ ఆదేశాన్ని అమలు చెయ్యాలి. అంతర్జాల యుగంలో ఒక వార్త ప్రయాణించే స్పీడ్, పరిధి చాలా ఎక్కువ. క్షణాల్లో ఖండాంతరాలు దాటిపోతుంది. కనుక ఈ నిబంధన సమంజసం. కానీ హానికరం, చట్ట వ్యతిరేకం అన్న వాటిని స్పష్టంగా నిర్వచించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. లేదంటే ప్రభుత్వానికి నచ్చనివి, అసౌకర్యం కలిగించేవి అన్నీ ఈ లిస్టులో చేరే ప్రమాదం ఉంది. ఇందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షక సంస్థ వుంటే మంచిది.
డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు