జనన మరణాల చట్టంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:30 AM
జనన మరణాల నమోదు సవరణ బిల్లు–2026ను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో ఇక చట్టంగా మారినట్టే. ఇకపై జననం కానీ మరణం కానీ రెండు సంవత్సరాల లోపు నమోదు కావాలి. ఆ సమయం దాటితే నమోదు కోసం...
జనన మరణాల నమోదు సవరణ బిల్లు–2026ను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో ఇక చట్టంగా మారినట్టే. ఇకపై జననం కానీ మరణం కానీ రెండు సంవత్సరాల లోపు నమోదు కావాలి. ఆ సమయం దాటితే నమోదు కోసం జ్యుడిషియల్ కోర్టులకు వెళ్ళాలి, ఇదీ సవరణ చట్టంలో పెట్టిన నిబంధన. ఇప్పటివరకు నమోదు అధికారం తహసీల్దార్/ఆర్డీఓలకు ఉండేది. ఇప్పుడు రెండు సంవత్సరాల లోపు వరకే వారు ఉత్తర్వులు ఇవ్వగలుగుతారు. రెండు సంవత్సరాలు దాటితే కోర్టు తలుపు తట్టాల్సిందే. ప్రజలకు తెలిసేలా ఈ విషయంలో విస్తృత ప్రచారం జరగాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలి. నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు ఈ చట్టం గురించి చెప్పాలి. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రచారం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ జననాలు నమోదు జరగక గిరిజన విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ విషయంలో ముఖ్య భూమిక నిర్వహించాలి. కోవిడ్ సమయంలో డాక్టర్లు వారి ఆసుపత్రిలో మరణించిన వివరాలు వెల్లడించకపోవడంతో మృతుల బంధువులు చాలా ఇబ్బందులు పడ్డారు. 8వ తరగతి నుంచి అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో దీనిపై ఒక పాఠం పెట్టాలి. అంత విస్తృత ప్రచారం చేస్తేనే ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. చట్టం చేసి చేతులు దులుపుకోకుండా ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆలోచించాలి.
మారిశెట్టి జితేంద్ర
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా