Share News

వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంపై చర్చాగోష్ఠి

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:34 AM

భారత కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ప్రారంభమైన నాటి నుంచి, ఈ ఉద్యమం ఎన్నో పాయలుగా చీలి ప్రస్థానం కొనసాగిస్తోంది...

వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంపై చర్చాగోష్ఠి

భారత కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ప్రారంభమైన నాటి నుంచి, ఈ ఉద్యమం ఎన్నో పాయలుగా చీలి ప్రస్థానం కొనసాగిస్తోంది. అన్ని పార్టీలు వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించే మాట్లాడుతున్నాయి. అన్ని పార్టీలూ తమ వారసత్వ మూలాన్ని 1920లలో ఉనికిలోకి వచ్చిన ఉద్యమంతోనే ముడివేసుకుంటున్నాయి. బ్రిటిష్ పాలనా కాలంలో అట్టడుగునున్న కార్మికులు, రైతులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు ఉద్యమాలను నడిపారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ లోక్‌సభలో ద్వితీయ రాజకీయ శక్తిగా నిలిచింది. కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో దశాబ్దాలపాటు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2004 ఎన్నికల్లో అరవైకి పైగా లోక్‌సభ స్థానాలను వామపక్ష పార్టీలు సాధించాయి. మరో పక్క అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల కమ్యూనిస్టు ఉద్యమం క్రమేపీ క్షీణతకు లోనైంది. పార్లమెంటులో నాలుగైదు స్థానాలకు వామపక్షం పరిమితమైంది. ఒకప్ప్పుడు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయారు. సాయుధపోరాట పంథా కూడా తీవ్రమైన ఎదురుదెబ్బ తిన్నది. ఇలా ఎందుకు జరిగింది? ఇక ముందు ఏం జరగబోతోంది?

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన ఈ ఎత్తుపల్లాలను లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 17, 18 తేదీల్లో విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ్ భవన్‌ రెండవ అంతస్తులో సదస్సు నిర్వహిస్తున్నాం. శోభన్‌లాల్‌దత్తా గుప్తా (కలకత్తా యూనివర్సిటీ), కె.శ్రీనివాసులు (ఉస్మానియా యూనివర్సిటీ), అరిందం దత్తా (హుమయూన్‌ కబీర్‌ మహావిద్యాలయ), జి.విజయ్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ) ప్రసంగిస్తారు. రెండవ రోజు ఐ.నర్సయ్య (జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ), పాణి (విరసం), ఆనంద్‌ తేల్‌తుంబ్డే (రచయిత–పౌరహక్కుల కార్యకర్త), ఎన్‌.అంజయ్య (నాగార్జున యూనివర్సిటీ) ప్రసంగిస్తారు.

సోషల్ సైన్సెస్ ట్రస్టు, ప్రోగ్రెసివ్‌ఫోరం,

విజయవాడ

ఈ వార్తలూ చదవండి

రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 15 , 2026 | 01:34 AM