Share News

బతుకు వేరు

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:33 AM

బంధాలన్నీ తెంపుకుంటూ పోతే ఒట్టిపోతావు బతుకు వేరును గమనించి చూడు...

బతుకు వేరు

బంధాలన్నీ

తెంపుకుంటూ పోతే

ఒట్టిపోతావు

బతుకు వేరును

గమనించి చూడు

మనసు పొరల్లో తేమ ఊరుతుంది

ఊరకే వెళ్లిపోతే ఎలా

ఒక మొక్కకో కుక్కకో

దగ్గర కావాలి కదా!

ఐశ్వర్యం నిన్ను

గరుకుగా మార్చేస్తుంది

నీ కరుకుతనం

లోకాన్ని గాయపరుస్తుంది

దెబ్బ తగిలిన మనిషికి

మాట ఉపశమనం కావాలి

ముఖం చాటేయకూడదు

రాలడానికి

చిగురించడానికి మధ్య

జీవితం ఒక వారధి

ప్రేమల్ని స్నేహాల్ని

అక్కున చేర్చుకోకపోతే

నీవు సమాధి రాయివే

జీవితంలోంచి సమాజాన్ని చూస్తావో

సమాజం లోంచి జీవితాన్ని వెదుకుంటావో

ఏదైనా కానివ్వు

నీవొక చెలిమ కావాలి

తూకాల చూపులకు స్వస్తి పలుకు

కరుణ శిఖరాన్ని అధిరోహించు

బతికి ఉన్నట్టు ఆధార్ అవసరమే

ఉత్తనే బతికి ఉండడం అవసరమంటావా.

తెలుగు వెంకటేష్

99853 25362

ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 05 , 2026 | 04:33 AM