Share News

అవినీతిపరులను కట్టడి చేయాలి

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:26 AM

ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ప్రొఫెసర్ మురళి కర్ణం ‘లంచాల్లో మనం విశ్వ గురువులం’ అని ఎంతో చక్కగా విశ్లేషించారు. నేడు దేశంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా అవినీతి మాత్రం...

అవినీతిపరులను కట్టడి చేయాలి

ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ప్రొఫెసర్ మురళి కర్ణం ‘లంచాల్లో మనం విశ్వ గురువులం’ అని ఎంతో చక్కగా విశ్లేషించారు. నేడు దేశంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా అవినీతి మాత్రం భారీగా పెరిగింది. లక్షల రూపాయల జీతం లభిస్తున్నా కొందరు అవినీతి ఉద్యోగులు కోట్ల రూపాయలు కూడబెట్టి, అవినీతి రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారు. అవినీతి నిరోధక‌ శాఖ అధికారులు పట్టుకొని, మీడియా రచ్చచేస్తే, అప్పుడు వారి పై అధికారులు కొద్ది కాలం సస్పెండ్ చేయడం, ఆ హడావుడి తగ్గగానే తిరిగి ఉద్యోగంలో చేరి జీతభత్యాలన్నీ పొందుతున్నారు. రిటైర్మెంట్ వరకు ఉద్యోగ భద్రత‌ ఉన్నదనే ధీమా వారిది. కనుక ఇలాంటి భారీ అవినీతి కేసులపై ప్రభుత్వం శీఘ్రమే దర్యాప్తు జరిపి, నేరం రుజువైతే వెంటనే డిస్మిస్ చేయాలి. అప్పుడే అవినీతిపరులకు భయం కలుగుతుంది. కొందరు ప్రజాప్రతినిధుల‌‌ అనుచిత జోక్యంతో నీతి,‌ నిజాయితీ గల అధికార్లు, సిబ్బంది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేని దుస్థితి వచ్చింది. ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు చేపట్టే ముందు వారి, వారి కుటుంబీకుల ఆస్తి వివరాల్ని బహిరంగంగా వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలి. అప్పటి, ఇప్పటి ఆస్తుల్లో భారీ తేడాలుంటే, అక్రమాస్తులను అవినీతి నిరోధక శాఖ తక్షణం జప్తు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

తిరుమలశెట్టి సాంబశివరావు (గుంటూరు)

ఈ వార్తలూ చదవండి

రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 15 , 2026 | 01:26 AM