క్వాంటం విప్లవానికి అమరావతి వేదిక!
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:27 AM
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం ఇప్పుడు ‘క్వాంటం’, ‘ఏఐ’ అనే రెండు శక్తి వంతమైన రెక్కలతో ఎగరడానికి సిద్ధమయింది. నాడు సాఫ్ట్వేర్ విప్లవానికి హైదరాబాద్...
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం ఇప్పుడు ‘క్వాంటం’, ‘ఏఐ’ అనే రెండు శక్తి వంతమైన రెక్కలతో ఎగరడానికి సిద్ధమయింది. నాడు సాఫ్ట్వేర్ విప్లవానికి హైదరాబాద్ చిరునామాగా మారితే, నేడు అంతకు మించిన క్వాంటం సాంకేతిక విప్లవానికి అమరావతి సిద్ధమయింది. ఐటీ యుగం నుంచి నేడు ‘క్వాంటం కంప్యూటింగ్’, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ శకంలోకి మానవాళి మారుతున్న పరిణామాలను ముందుగానే గుర్తించి అమరావతిని క్వాంటం సాంకేతికతకు కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు దార్శనిక ఆలోచనలకు నిదర్శనం. రాజధాని అమరావతిని దేశానికే ‘క్వాంటం వ్యాలీ’గా తీర్చిదిద్దాలన్న ఆయన దూరదృష్టికి, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని ‘నీలిట్’ డీమ్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటుతో బలమైన పునాది పడింది. దీంతో క్వాంటం, ఏఐ, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్, సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్లో పోటీపడే సామర్థ్యం పెరుగుతుంది. మూడు నెలల్లో ప్రారంభం కానున్న స్వల్పకాలిక అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ కోర్సులు, ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రతిభావంతులకు సైతం కొత్త ద్వారాలు తెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పడిన ఈ అడుగు, మన యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలని ఆశిద్దాం. అలాగే ‘మేడ్ ఇన్ ఆంధ్రా’ మేధస్సు ప్రపంచ వేదికపై సగర్వంగా నిలవాలని, ఆధునిక భారత సాంకేతిక ప్రస్థానంలో అమరావతి ఒక చెరగని మైలురాయిగా నిలవాలని, రాబోయే తరాలకు ‘స్వర్ణాంధ్ర’ ఫలాలను అందించాలి.
నీరుకొండ ప్రసాద్
ఇవి కూడా చదవండి..
అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..