అద్వైత
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:36 AM
కవిత ముందు మోకరిల్లి పసిమనిషిని ఆశ్రయించి నిన్నటి మిగిలిన చుక్కల్ని పెదవిన చప్పరించి ఇరుదేహాల దేవభాష చిలికిన అమృత సొన...
కవిత ముందు మోకరిల్లి
పసిమనిషిని ఆశ్రయించి
నిన్నటి మిగిలిన చుక్కల్ని పెదవిన చప్పరించి
ఇరుదేహాల దేవభాష చిలికిన
అమృత సొన సంప్రోక్షించి
కళ్ళకద్దుకుని హారతి వెలుగున జ్వలించి
తరగని తరువనాల పచ్చని వన్నెన కరిగి చరించి
రోజంతా వెన్నంటే పాట పరవశాన చలించి
మనసున మంటను
రెప్పమాత్రాన చల్లార్చవచ్చు
అప్పటికైనా
తొలగి.. మానససరోవరాన నిశ్చలత చేరవచ్చు
ఎడారైనా పట్టెడు పసిరికను పొదువుకోవచ్చు
ఆవిరికాని ఆశతో
ఆసరికైనా
దేహం మోసే
నిరంతర నిప్పు వ్రణాల్ని
ఎలా ఆర్పను
ఏ లేపనం చల్లార్చెను
మనశ్శరీరాలు ఏకం చేసే
అద్వైత
మృత్యుశీతల మాతృస్పర్శ తప్ప
పిన్నంశెట్టి కిషన్
97002 30310
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి