Share News

జాతీయ నాస్తిక మేళా

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:20 AM

దేశంలో ఫాసిస్టు శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. అఖండ భారత్ మహా కలల్లో విహరించే మతోన్మాద సంఘా లిప్పుడు సాంస్కృతిక పెత్తనం కోసం ప్రశ్నించే గొంతుల్ని, అసమ్మతి తెలిపే...

జాతీయ నాస్తిక మేళా

దేశంలో ఫాసిస్టు శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. అఖండ భారత్ మహా కలల్లో విహరించే మతోన్మాద సంఘా లిప్పుడు సాంస్కృతిక పెత్తనం కోసం ప్రశ్నించే గొంతుల్ని, అసమ్మతి తెలిపే బుద్ధిజీవుల్ని, అనాగరికపు ఆచారాన్ని ఎదిరించే హేతువాదుల్ని, పుక్కిటి పురాణాలు ప్రజల చరిత్ర కాదన్న చరిత్రకారుల్ని వేధించి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో 34వ జాతీయ నాస్తిక మేళా జరుగుతున్నది. 14న ‘సమకాలీన సందర్భాల్లో భగత్‌సింగ్, పెరియార్ నాస్తిక ఆలోచనల ప్రాసంగికత’ అంశంపై బి.రంగస్వామి, ‘ప్రాచీన భారతంలో చార్వాకం’పై ఎంవీఎస్ శర్మ, ‘పురాణ ప్రలాపం’పై జె.లక్ష్మీరెడ్డి, ‘దాచేస్తే దాగని సత్యం.. జీవ పరిణామం’పై కట్టా సత్యప్రసాద్‌, ‘మతాలు–మూఢ విశ్వాసాలు’పై ముళ్ళై వేందన్‌, ‘ఖగోళ శాస్త్ర విజ్ఞానం’పై రవిరాజా పోతినేని ప్రసంగిస్తారు. 15వ తేదీన ‘ప్రైవేటీకరణ విధానాలు–మన దృక్పథం’పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ‘భారత రాజ్యాంగం–లౌకికవాదం–సవాళ్లు’పై చెన్నుపాటి దివాకర్ బాబు, ‘సంక్షోభ కాలంలో బుద్ధిజీవుల పాత్ర’పై ఎన్‌.వేణు గోపాల్‌, ‘ఫాసిజం–భారతీయ సమాజం’పై బి.వి.రాఘవులు, ‘వైజ్ఞానికతకు మతభావాలకు పొసగని మైత్రి’పై జయ కుమార్‌ తదితరులు ప్రసంగిస్తారు.

నాస్తిక సమాజం

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 01:20 AM