this week various programs 5-10-2026
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:27 AM
రెండు తరాల కవిసంగమం, సాహిత్య సమ్మేళనం, రాయలసీమ కథల పోటీ, చిన్న కథలకు ఆహ్వానం...
రెండు తరాల కవిసంగమం
‘రెండుతరాల కవిసంగమం’ సీజన్ 2, సీరీస్ – 48 అక్టోబర్ 10 సా.6గంటలకు హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్ (రాంకోఠి)లో జరుగుతుంది. కార్యక్రమంలో వారాల ఆనంద్ తన జీవితం, కవిత్వ నేపథ్యాల్ని వివరించి స్వీయ కవితలు చదువుతారు. కొత్తతరం కవులు హాథీరామ్ సభావట్, చిట్ల ప్రేమ్ కుమార్, మామిడిపల్లి ఇంద్రాణి, వినులు పాల్గొన్ని తమ కవిత్వాన్ని చదివి వినిపిస్తారు.
యాకూబ్
సాహిత్య సమ్మేళనం
సాహితీ స్రవంతి – అల్లూరి విజ్ఞాన కేంద్రం, విశాఖపట్నం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో అల్లూరి విజ్ఞాన కేంద్రం, డాబా గార్డెన్స్, విశాపట్నంలో సాహిత్య సమ్మేళనం జరుగుతుంది. వర్తమాన కవిత్వం తీరుతెన్నులు, కల్లోల వర్తమానంలో కథ ప్రాముఖ్యత, ప్రజలను ప్రభావితం చేస్తున్న పాట, సాహితీ మూర్తులతో ఇష్టాగోష్టి, దేశ కాల వర్తమాన పరిస్థితులపై ప్రముఖుల క్లుప్త సందేశాలు ఈ సాహిత్య సమ్మేళనంలో ఉంటాయి. తెలకలపల్లి రవి, దర్భశయనం శ్రీనివాసచార్య, కె.ఎస్. చలం, పల్లి నల్లనయ్య, డి.వి.జి. శంకరరావు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, నల్లి ధర్మారావు తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు: 94411 76882.
చీకటి దివాకర్
రాయలసీమ కథల పోటీ
రాయలసీమ సమకాలీన స్థితిగతుల నేపథ్యంగా కథా రచన పోటీలను ఎం.వి రమణారెడ్డి స్మారకార్థం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. నవంబర్ 10 లోపు కథలను పంపాలి. ఎంపికైన కథలకులకు రూ.20 వేల నగదు బహుమతిని అందచేస్తాం. సలహాదారులుగా యం.మురళీధర్, మెట్టుపల్లె జయదేవరెడ్డి, తిమ్మాపురం ప్రకాశ్‌లు కొనసాగుతారు. మరిన్ని వివరాలకు ఫోన్: 99639 17187.
అప్పిరెడ్డి హరినాథరెడ్డి
చిన్న కథలకు ఆహ్వానం
సోమేపల్లి సాహితీ పురస్కారాల కోసం చిన్నకథలు పంపాల్సిందిగా కోరుతున్నాం. అత్యుత్తమ, ఉత్తమ, మంచి కథలకు వరుసగా రూ.2500, రూ.1500, రూ.1000. ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇద్దరికి. రాతప్రతిలో రెండు నుంచి 4 పేజీల లోపు, డి.టి.పిలో 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాసిన కథలను, హామీ పత్రంపైన మాత్రమే రచయిత వివరాలతో అక్టోబర్ 30 లోపు చిరునామా: రమ్యభారతి, పి.బి.నెం:5, 11–57/1–32 జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ–520001, ఫోన్: 92474 75975కు పంపాలి.
వశిష్ట సోమేపల్లి
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!