ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలం..
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:05 AM
ఈ వారం రాశిఫలాలు.. ఆదివారం.. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు.
అనుగ్రహం
8 - 14 ఫిబ్రవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధన సహాయం తగదు. ఒక సమాచారం ఆలోచిం పచేస్తుంది. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనుల్లో అవాంతరాలెదురైనా పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ వద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ చొరవతో శుభ కార్యం నిశ్చయమవుతుంది. తరచూ బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అప్రమత్తంగా ఉండాలి. ఏజెన్సీలను నమ్మ వద్దు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మిథునం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ చొరవతో శుభ కార్యం నిశ్చయమవుతుంది. తరచూ బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అప్రమత్తంగా ఉండాలి. ఏజెన్సీలను నమ్మ వద్దు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు చక్కబడతాయి. వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యం సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావల సిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లిం పుల్లో జాప్యం తగదు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. అందరితోనూ మితంగా సంభా షించండి. బాధ్యతలు అప్పగించవద్దు. అవివా హితులకు శుభవార్తా శ్రవణం. బంధువులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. ప్రతీ వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. గృహ నిర్మాణం పూర్తవుతుంది. శుభకార్యానికి సన్నా హాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. రాబడి పై దృష్టి పెడతారు. అవసరాలకు ధనం అం దుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. పరిచ యాలు బలపడతాయి. నోటీసులు అందుకుం టారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రముఖులకు చేరువవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ప్రతికూలతలు అధికం. ఆలో చనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటా నికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించు కోవటం శ్రేయస్కరం. ఆత్మీయులతో తరుచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. పనులు సానుకూల మవుతాయి. స్థిరాస్తి ధనం అందుకుంటారు. పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జోక్యం అనివార్యం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. శుభకార్యానికి హాజరవుతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగి స్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకూలతలున్నాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తారు. పనులు వేగవంత మవుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలు గుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారి స్తారు. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. పెద్దల సలహా పాటించండి. చుట్టుపక్కల వారిని గమనించండి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. పెట్టుబడులకు అనుకూలం. ప్రతీ విషయంలో ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిం చండి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. గృహనిర్మాణం పూర్తికావస్తుంది.