తోటి విద్యార్థిని చేతిలో అవమానం.. బాలుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:05 PM
తోటి విద్యార్థిని తనను అవమానించిందన్న బాధతో ఓ 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇటీవల రాజస్థాన్‌లో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తోటి విద్యార్థిని తనను అవమానించిందన్న బాధతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇటీవల రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే విద్యార్థి రాజస్థాన్‌లోని ఢోల్‌పూర్ జిల్లాలో తన బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు.
గురువారం రాహుల్‌కు, అతడి సహ విద్యార్థినికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ మేని ఛాయను ఉద్దేశించి ఆమె అవమానకర వ్యాఖ్యలు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన రాహుల్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు రాహుల్ తన గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారు పడ్డ బంధువులు గది కిటికీలోంచి తొంగిచూడగా రాహుల్ విగతజీవిగా కనిపించాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రాహుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అడగ్గానే రూ.20 ఇవ్వలేదని నరికేశాడు
రక్తపు మడుగులో భర్త, కుమారుడు.. పక్కనే ఫోన్ చూస్తూ కూర్చున్న భార్య!