Share News

ట్రక్ ఢీకొనడంతో బాలుడి మృతి.. వాహనానికి నిప్పంటించిన స్థానికులు

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:32 PM

మహారాష్ట్రలో ఓ బాలుడు ట్రక్ కింద పడి మరణించడంతో స్థానికులు కోపం పట్టలేక ఆ వాహనానికి నిప్పు పెట్టారు. జల్‌గావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

ట్రక్ ఢీకొనడంతో బాలుడి మృతి.. వాహనానికి నిప్పంటించిన స్థానికులు
Mob Burns Down Truck

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ బాలుడు ట్రక్ కింద పడి మరణించడంతో స్థానికులు కోపం పట్టలేక ఆ వాహనానికి నిప్పు పెట్టారు. జల్‌గావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఓ బాలుడు దేవాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ ట్రక్ అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టింది. చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దారుణం చూసి కోపం పట్టలేకపోయిన స్థానికులు ట్రక్‌కు నిప్పంటించారు.


ఘటన సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదుపులోకి తెచ్చారు. ఇక ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, స్థానికులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం డ్రైవర్‌ను తమకు అప్పగించాలని అన్నారు. ఒకానొక దశలో వారు అగ్నిమాపక సిబ్బందిని కూడా మంటలను ఆర్పకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ స్థాయిలో బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన నేపథ్యంలో అక్కడ వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల్లో ఓటమి.. రీకౌంటింగ్‌ను కోరుతూ హైకోర్టులో స్టాలిన్ పిటిషన్

న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Updated Date - Aug 24 , 2026 | 10:40 PM