Share News

ఆఫీసు వద్ద భార్యను.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. ఆపై..

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:42 PM

యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె ఆఫీస్ వద్దే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చి తన సోదరిని చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆఫీసు వద్ద భార్యను.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. ఆపై..
Man Kills wife sister, then ends life

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె ఆఫీస్ వద్దే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చి తన సోదరిని చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. లఖ్నవూలో గురువారం ఈ దారుణం జరిగింది. నిందితుడిని మానస్ వాజ్‌పేయిగా పోలీసులు గుర్తించారు. అతడు ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.

భార్యపై కాల్పులు జరిపిన అనంతరం మానస్ ఇంటికి వచ్చి తన సోదరిపై కూడా కాల్పులు జరపడంతో ఆమె మరణించింది. అనంతరం మానస్ తనపై తాను కాల్పులు జరుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు. ‘నన్ను మోసం చేసిన భార్యను ఈ రోజు చంపేశా. ఇప్పుడు నా సోదరిని చంపి నేను చనిపోవాలి. నా భార్య సోదరి ప్రజ్ఞ, భరత్‌కు అన్నీ తెలుసు’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ స్టేటస్‌ను చూసి అప్రమత్తమైన పొరుగింటి వ్యక్తి మానస్ ఇంటికి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిందితుడు తొలుత తన భార్య పని చేస్తున్న ఐసీసీఐ బ్యాంకు వద్దకు వెళ్లి ఆమెను బయటకు పిలిచారు. ఆ తరువాత వారిద్దరూ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ తరువాత దివ్యపై కాల్పులు జరిపిన మానస్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే దివ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. మానస్, దివ్యలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది దివ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 1 లక్ష వరకు సంపాదించే ఛాన్స్!

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి.. తిహార్ జైల్లో కన్నుమూత

Updated Date - Aug 20 , 2026 | 06:08 PM