జెప్టో ఐపీఓకి సెబీ ఓకే
ABN , Publish Date - May 09 , 2026 | 04:51 AM
క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. జెప్టోతో పాటు ఆటో కాంపోనెంట్స్ తయారీదారు...
క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. జెప్టోతో పాటు ఆటో కాంపోనెంట్స్ తయారీదారు ధూత్ ట్రాన్స్‌మిషన్, హారిజాన్ ఇండస్ట్రియల్ పార్క్స్, సుర్గివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ కంపెనీల ఇష్యూలకు సెబీ ఓకే చెప్పింది. ఈ కంపెనీలన్నీ 2025 అక్టోబరు- 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ప్రాధమిక ముసాయిదా పత్రాలు సమర్పించాయి. జెప్టో ఈ ఐపీఓ ద్వారా జెప్టో రూ.11,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్