జీ లేబొరేటరీస్ నుంచి కేశ్‌వాపసీ
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:51 AM
జీ లేబొరేటరీస్ పురుషుల కోసం కేశ్‌వాపసీ పేరుతో అడ్వాన్స్‌డ్ హెయిర్‌కేర్, న్యూట్రీషన్ కిట్‌ను విడుదల చేసింది. పురుషుల్లో జుట్టు రాలకుండా...
హైదరాబాద్: జీ లేబొరేటరీస్ పురుషుల కోసం కేశ్‌వాపసీ పేరుతో అడ్వాన్స్‌డ్ హెయిర్‌కేర్, న్యూట్రీషన్ కిట్‌ను విడుదల చేసింది. పురుషుల్లో జుట్టు రాలకుండా, బట్టతల రాకుండా ఈ ఔషధం నివారిస్తుందని తెలిపింది. ప్రధానంగా యువతలో తరచుగా జుట్టు రాలే సమస్య తలెత్తుతోందని, ఇది వారిలో ఆత్మనూన్యతకు దారితీస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కేశ్‌వాపసీ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు జీ లేబొరేటరీస్ వెల్లడించింది. ఈ 30 రోజుల కేశ్‌వాపసీ కిట్‌లో ఉదయం 30 టాబ్లెట్లు, రాత్రి 30 టాబ్లెట్లతో పాటు ఉదయ 30 ఎంఎల్ తలకు రాసుకునే సీరమ్ (ఆయిల్), రాత్రి రాసుకునే విధంగా 30 ఎంఎల్ సీరమ్ ఉంటుందని తెలిపింది. అశ్వగంధ వేర్లు, కచ్‌నార్, విటమిన్ ఈ, ద్రాక్ష విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అమినో యాసిడ్స్‌తో ఈ టాబ్లెట్లను తయారు చేసినట్లు వెల్లడించింది. సీరమ్‌ను రెడ్‌ఎన్సిల్, కాస్టర్ ఆయిల్, అలోవీరా, ఆమ్లా, శికాకాయ్ వంటి వాటితో తయారు చేసినట్లు తెలిపింది. ఈ కేశ్‌వాపసీ కిట్ ధర రూ.2,500 అని జీ లేబొరేటరీస్ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..
అమెరికన్ పిల్లలకు మస్క్ బంపరాఫర్