అమెరికన్ పిల్లలకు మస్క్ బంపరాఫర్
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:03 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికన్ పిల్లలకు బంపరాఫర్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి పిల్లాడికి తన ఏరోస్పేస్, ఏఐ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన...
ప్రతి పిల్లాడికీ ఒక స్పేస్‌ఎక్స్ షేరు..
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికన్ పిల్లలకు బంపరాఫర్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి పిల్లాడికి తన ఏరోస్పేస్, ఏఐ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఒక షేరును ఉచితంగా కేటాయించనున్నట్లు మస్క్ సోమవారం వెల్లడించారు. ‘ప్రజా ప్రయోజన నిధి’కి తమ కంపెనీలో 5 శాతం వాటా షేర్లను కేటాయించనున్నట్లు ప్రముఖ ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ చేసిన ప్రకటనను విమర్శించిన మస్క్.. ఆ తర్వాత కొంత సమయానికే తన ప్రణాళికను ప్రకటించారు. అయితే, షేర్ల కేటాయింపు తేదీ, విధివిధానాలు, ఎవరు అర్హులు..? వంటి వివరాలను మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. అధికారిక జనాభా లెక్కల ప్రకారం.. 2025 జూలై 1 నాటికి అమెరికాలో 7.2 కోట్ల మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. కాగా, గత శుక్రవారం స్పేస్‌ఎక్స్ షేరు ధర రూ.146.03 డాలర్ల వద్ద ముగిసింది. ఈ లెక్కన ఆయన అమెరికాలోని పిల్లలకు కేటాయించబోయే షేర్ల విలువ 1,050 కోట్ల డాలర్ల (రూ.99,750 కోట్లు) వరకు ఉండనుంది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే