30శాతం తగ్గిన జాగిల్ ప్రీపెయిడ్ లాభం
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:36 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాస్ ఫిన్‌టెక్ సంస్థ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.24.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాస్ ఫిన్‌టెక్ సంస్థ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.24.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.34.98 కోట్లతో పోల్చితే 30 శాతం క్షీణించింది. త్రైమాసిక సమీక్షా కాలం లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం మాత్రం 34.2 శాతం వృద్ధితో రూ.432.21 కోట్ల నుంచి రూ.579.85 కోట్లకు చేరుకుంది. డైస్ కొనుగోలుతో ఉద్యోగుల బెనిఫిట్స్ వ్యయాలతో పాటు ఇతర ఖర్చులు పెరిగిపోవటం లాభాలపై ప్రభావం చూపించిందని కంపెనీ పేర్కొంది